అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

● అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ ● గ్రీవెన్స్‌లో 85 దరఖాస్తులు స్వీకరణ ● విరాసత్‌ చేయడం లేదు ● కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలి ● పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి ● తాగునీటి సమస్య పరిష్కరించాలి ● ఇందిరమ్మ బిల్లులు రావడం లేదు

కై లాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, మెప్మా పీడీ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 85 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..

అయ్యా నా భర్త పేరి ట గ్రామ శివారులో 2.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిది నెలల క్రి తం ఆయన చనిపోయాడు. కొడుకు ఉన్నా తిండి పెట్టడం లేదు. భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు చేసిన. డిపెండెంట్‌ సర్టిఫికెట్‌తో పాటు మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసిన. అ యినా తహసీల్దార్‌ పట్టా చేయడం లేదు. నాకు పట్టా చేసి న్యాయం చేయాలని కోరుతున్నా.

– జక్కుల గంగమ్మ, సుంకిడి, తలమడుగు

మా గ్రామంలో సామాజికపరమైన కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అనువైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నాం.కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. స్పందించి మంజూరు చేయాలని కోరుతున్నాం.

– దాబా–బి గ్రామస్తులు, గాదిగూడ

పదేళ్లుగా మా గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. సమస్యలు పరిష్కరించమని కోరితే పట్టించుకోవడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి.

– కంఠ గ్రామస్తులు, జైనథ్‌ మండలం

మా గ్రామ పంచాయతీ పరిధిలో మూడు ఆవాస ప్రాంతాలున్నాయి. సుమారు 5వేల జనాభా ఉంది. మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే స్పందించి ప్రత్యేక పైపులైన్ల తో పాటు వాటర్‌ట్యాంక్‌ నిర్మించి సమస్యను పరిష్కరించాలని విన్నవించాం.

– టేకం కవిత, సర్పంచ్‌, ఉమ్రి, ఉట్నూర్‌

మేమంతా ఇందిరమ్మ లబ్ధిదారులం. ఇళ్లు మంజూరుతోఉన్న గుడిసెలు తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించాం. ప్రస్తుతం రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు పైసా బిల్లు రాలేదు. మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్పందించి మాకు న్యాయం చేయాలి. – ధనోరా –బి గ్రామస్తులు, ఇంద్రవెల్లి

Advertisement
 
Advertisement
Advertisement