కై లాస్‌నగర్: మన ఇసుక వాహనం పోర్టల్‌లో లబ్ధి దారులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేలా అవగా హన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. బుకింగ్ సమయంలో అవసరమైన పత్రాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదా రులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంటికి 8 ట్రిప్పుల వరకు ఇసుక పొందే అవకాశం ఉందని, అవసరమైతే దీనిని 10 నుంచి 12 ట్రిప్పులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను తహసీల్దార్లు, వార్డు ఆఫీసర్ల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జా ప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను 7569538588, 9491053611 అందుబాటులోకి తెచ్చామని, ఇబ్బందులుంటే సంప్రదించాలని సూచించారు. అంతకు ముందు రిజిస్ట్రేషన్, బుకింగ్ విధానంపై హైదరాబాద్ నుంచి సీజీజీ కోఆర్డినేటర్ నరేష్ వర్చువల్ విధానం ద్వారా అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రమేశ్, సతీష్, తహసీల్దార్ రాజేశ్వరి, పంచాయితీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ట్రాక్టర్ వాహన యజమానులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


