ఎక్స్‌లెన్స్‌ అవార్డు గ్రహీతలకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌లెన్స్‌ అవార్డు గ్రహీతలకు కలెక్టర్‌ అభినందన

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

కై లాస్‌నగర్‌: రోడ్డు భద్రతపై జిల్లా యంత్రాంగం, రవాణాశాఖ చేపట్టిన వినూత్న ప్రచారానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రవాణా రంగంలో చేసిన కృషికి గాను జిల్లాకు 2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్స్‌లెన్స్‌ అవార్డు–2026 దక్కింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా రవాణ శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వారు కలెక్టర్‌ రాజర్షిషా ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అరైవ్‌ అలైవ్‌ పేరిట ఏప్రిల్‌ 13 నుండి 18 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఇందులో రవాణా శాఖ అధికారి రవీందర్‌ కుమార్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. హరీంద్ర కుమార్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం,డీఎం తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement