నాణ్యమైన బోధన అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన బోధన అందించాలి

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌ అన్నారు. జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు సోమవారం సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కృత్యాధార బోధనతో విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారని తెలిపారు, సర్టిఫికెట్లు పొందిన వారిలో సిరికొండ మండలం రాంపూర్‌గూడ చెందిన ఉపాధ్యాయుడు చౌహన్‌ నరేష్‌, రాంపూర్‌–బి కి చెందిన పైడి సునీత, కప్పర్లకు చెందిన సామన్‌పెల్లి గంభీర్‌, తేజాపూర్‌కు చెందిన కోడూర్‌ సంతోష్‌కుమార్‌, మావల–2కు చెందిన కవిత, గోండ్‌గూడకు చెందిన శ్రీనివాస్‌, మాంగూర్లకు చెందిన కె. రాజన్న, యాపల్‌గూడకు చెందిన అకాష్‌, ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖిల్లా పాఠశాలలకు చెందిన ఇర్ఫాన్‌బేగం ఉ న్నారు. ఇందులో ఏఎంవో లక్ష్మణ్‌, అసిస్టెంట్‌ ఏఎంవో అజయ్‌కుమార్‌, తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement