సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆందోళన

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

కై లాస్‌నగర్‌: పట్టణంలోని నిషాన్‌ఘాట్‌, 170 సర్వేనంబర్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇంటిపట్టాల జారీతో పాటు విద్యుత్‌, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేస్రం భాస్కర్‌, పట్టణ కార్యదర్శి చంద్రమౌళి, కృష్ణస్వామి, కేశవ్‌, సంగీత, భాను, నిస్సర్‌, భూ మన్న, షబానాఖాన్‌, సుజాత, సునీత, అమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement