‘లవ్‌ జిహాద్‌ నిరోధించడంలో పోలీసులు విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘లవ్‌ జిహాద్‌ నిరోధించడంలో పోలీసులు విఫలం’

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో లవ్‌ జిహాద్‌ను నిరోధించడంలో పోలీస్‌ యంత్రాంగం పూ ర్తిగా విఫలమైందని వీహెచ్‌పి జాతీయ అధికా ర ప్రతినిధి రావినూతల శశిధర్‌ అన్నారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో లవ్‌ జిహాద్‌ పెరిగిపోతోందని పేర్కొన్నారు. హిందూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులపై చర్యలు తీసుకోకుండా, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వీహెచ్‌పి, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలోనే లవ్‌ జిహాద్‌ ఉదంతాల్లో జిల్లా అగ్రభాగాన ఉండటం ఆందోళనకరమన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం వైఫ ల్యాలను రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. ఇందులో పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, శ్రీరామ్‌ శర్మ, దర్మ ప్రసార ప్రముఖ్‌ రాజుల్వార్‌ దత్తు, సత్సంగ్‌ ప్రముఖ్‌ సంతోష్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement