నెన్నెల: మండలంలోని జెండావెంకటాపూర్ పంచాయతీ పరిధి శ్రావణ్‌పల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కోసం రహస్యంగా దాచి ఉంచిన 1600 కేజీల బెల్లం, 15 కేజీల పటికను పక్కా సమాచారం మేరకు ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి శనివారం స్వాధీనం చేసుకున్నట్లు చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ ఎం.హరి తెలిపారు. 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లంపానకాన్ని, ఒక గుడుంబా బట్టిని ధ్వంసం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బెల్లాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామన్నారు. పట్టుకున్న బెల్లం విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా బెల్లం రవాణా, నాటుసారా తయారు విక్రయించినా పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చెన్నూర్ ఎకై ్సజ్ ఎస్సై బి.వెంకటరమణ, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.


