ఇచ్చోడ: మండలంలోని గుబ్బ అటవీప్రాంతంలో జింకలు సంచరిస్తుంది. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న టింబర్ డిపో ప్రహరీ వెనుకభాగం నుంచి శనివారం జింకల గుంపు కనిపించింది. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి టింబర్ డిపో సమీప ప్రాంతంలో నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. గుబ్బ, డిగ్నూర్, జున్ని అటవీ ప్రాంతాల్లో సంచరించే జింకలు నీరు తాగేందుకు నీటితొట్టి వద్దకు వస్తాయని ఇచ్చోడ ఎఫ్‌ఆర్వో పుండలిక్ తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి తొట్టీల్లో ప్రతీరోజు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


