తాంసి: మండల కేంద్రంలోని శుక్రవారం రా త్రి పూరి గుడిసె దగ్ధమైంది. గొద్దెల చిన్నక్క నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో దేవుని చిత్రపటం వద్ద దీపం మంటలు అంటుకుని చెలరేగాయి. చిన్నక్క కేకలు వేయడంతో చుట్టూపక్కల వారు అక్కడికి చేరుకుని నీటితో మంటలార్పివేశారు. అప్పటికే బి య్యం, బట్టలు, తదితర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.20వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. సర్పంచ్ సంతోశ్‌రెడ్డి శనివారం బాధితురాలి ఇంటి ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున పరిహా రం అందేలా చూస్తానని భరోసానిచ్చారు.


