ఎస్టీపీపీలో జ్యోతిబాపూలే జయంతి | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో జ్యోతిబాపూలే జయంతి

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

జైపూర్‌: ఎస్టీపీపీలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీపీ ఓపెన్‌ ఆడిటోరియంలో ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్‌తో కలిసి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఎస్టీపీపీలో నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పిట్‌ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచి ప్రెసిడెంట్‌ పంతులా, పీఎంపీఎల్‌ హెడ్‌ అఖిల్‌కపూర్‌, డీజీఎం పర్సనల్‌ కిరణ్‌బాబు, బీసీ లైసన్‌ ఆఫీసర్‌ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం

మంచిర్యాలటౌన్‌: మహాత్మా జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ మంత్రి రామన్న, బీజేపీ కార్యాలయ కార్యదర్శి మల్లికార్జున్‌, గర్మిళ్ల జోన్‌ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ కార్పొరేటర్లు గాజుల ముఖేష్‌గౌడ్‌, కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్‌ బొట్ల సత్యనారాయణ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వే శారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో మొక్కజొన్న దగ్ధం

బోథ్‌: ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఐదెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. మండలంలోని నిగిని గ్రామంలో శనివారం ఈఘటన చోటు చేసుకుంది. జాదవ్‌ అంకుష్‌ తన చేనులో ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ప్రస్తుతం పంట కోతలు ప్రారంభించాల్సి ఉంది. అయితే విధి పగబట్టడంతో చేతికి రావల్సిన పంట ఆగ్నికి అహుతైంది. చేనులో విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగి పంటకు అంటుకున్నాయి. దాదాపు మూడున్నర ఎకరాల్లో పంట మొత్తం కాలిబూడిదైంది. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాఽధిత రైతు కోరాడు.

పెన్‌గంగలో పడి వ్యక్తి మృతి

సాత్నాల: పెన్‌గంగ నదిలో పడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు భువనగిరి పరమేశ్వర్‌ (45) భోరజ్‌ మండలం బాలాపూర్‌ గ్రామ వాసిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మృతుడు గత కొన్నేళ్లుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో నివసిస్తున్నారు. శనివారం పెన్‌గంగ సరిహద్దు ప్రాంతంలో మృతి చెందడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయడా, ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement