బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వరంగల్ జిల్లా నుంచి శనివారం ఇద్దరు యు వకులు వచ్చారు. గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగి స్నానం చేస్తుండగా, లో తు తెలియకుండా లోపలికి వెళ్లారు. దీంతో ఇద్దరు నీటమునుగుతూ కాపాడాలని కేకలు వేశారు. అ క్కడే ఉన్న జాలరి డప్పు నరేశ్ వెంటనే నదిలో దూ కాడు. ఈదుకుంటూ వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొ చ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన యశ్వంత్, సా త్విక్ స్నేహితులు. బాసరకు వచ్చిన వీరు గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. లోతు తెలియకపోవడంతో నది లోపలికి వెళ్లారు. ఈక్రమంలో మొ దట ఒకరు కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లాడు. దీంతో ఇద్దరు కొట్టుకుపోతూ కేకలు వేశారు. జాలరి గమనించి వెంటనే నదిలో దూకి ఇద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయినట్లు భక్తులు తెలిపారు. నిండు ప్రాణాలు కాపాడినందుకు నరేశ్‌ను అభినందించారు.
ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు..
బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన వెంకటేశ్, మహారాష్ట్రలోని ధర్మబాద్‌కు చెందిన శివ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు శనివారం బాసర గోదావరి వద్దకు వచ్చారు. వారిని గమనించిన స్థానికులు వెంట నే డయల్ 100కు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ బృందం సంఘటన స్థ లానికి చేరుకుని, అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఇద్దరిని కాపాడింది. స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అ ప్పగించారు. ఇద్దరిని కాపాడిన బాసర పోలీసులను ఎస్పీ జానకీషర్మిల అభినందించారు.


