నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ‘వారసత్వ సంబురాలు’కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా చరిత్ర, వైద్యవృత్తి, సంస్కృతి, సంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం రిటైర్డ్ పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో రచయితలు సాహిత్య అభివృద్ధికి, భాషా పరిరక్షణకు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమన్నారు. అనంతరం వైద్యులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


