బాసరలో గోహారతి
కడెం: మండలంలోని అల్లంపల్లి పంచాయ తీ పరిధి పాలరేగడి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. శనివారం వారు గైర్హాజరయ్యారు. విద్యార్థులు లేకున్నా తరగతి గదిలో ఉపాధ్యాయుడు రమేశ్ ఒక్కరే ఉండడం కనిపించారు.
బాసర: బాసరలో వేదభారతి పీఠం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోహారతి పూజ నిర్వహించారు. గోవులకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతీ శనివారం నిర్వహిస్తున్నట్లు వేద విద్యానంద నాద స్వామిజీ తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.


