కైలాస్‌నగర్(బేల): ప్రభుత్వ పథకాలను ప్రజ లకు చేరవేయాలని ఎంపీ నగేశ్ అన్నారు. బీజే పీ చేపట్టిన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో భాగంగా శుక్రవారం బేల, జైనథ్, భోరజ్, సాత్నాల మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలో చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరేలా చేయడం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, మోహన్ అగర్వాల్, క్రాంతి కుమార్, రాకేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


