ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యం

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్‌ డే సందర్భంగా ‘హెల్త్‌ వీక్‌’ యోగా శిబి రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పాల్గొ ని ప్రజలు,విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశా రు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా అత్యుత్తమ సాధనమన్నారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రజారోగ్యానికి పెద్దపీ ట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బండారి అనూష, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. పూల్‌లోని నీటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ వైద్యం ప్రజలకు వరం

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యసేవలను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ హోమియోపతి దినో త్సవం నిర్వహించా రు. ఆయుష్‌ వైద్య విధానాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ బండారి అనూష, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎంల గోదాం తనిఖీ

కై లాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్‌ రాజర్షి షా శు క్రవారం తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లను పరి శీలించారు. నిరంతరం పహారా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వర్షం కా రణంగా తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకో వాలని, లోపల ఉన్న యంత్రాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని స్ప ష్టం చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement