ఆదిలాబాద్‌ ఆర్టీవో అధికారులకు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ ఆర్టీవో అధికారులకు జాతీయ అవార్డు

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

● రోడ్డు భద్రతలో వినూత్న కార్యక్రమాలకు గుర్తింపు ● వ్యక్తిగత విభాగంలోనూ ప్రశంస

ఆదిలాబాద్‌టౌన్‌: రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఆదిలాబాద్‌ జిల్లా ఆర్టీవో అధికారులకు జాతీయ స్థాయిలో ‘రోడ్డు భద్రత ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. జిల్లాలో 800 మంది విద్యార్థులతో నిర్వహించిన మానవ గొలుసు, ‘అమ్మా.. నాన్న.. నెమ్మదిగా డ్రైవ్‌ చేయండి’ వంటి సందేశాలతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాయి. ఇండివిజువల్‌ విభాగంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పి.రవీందర్‌ కుమార్‌, ఎంవీఐ ఎస్‌.శ్రీనివాస్‌, ఏఎంవీఐ కె.హరేంద్ర కుమార్‌లు బెస్ట్‌ పర్ఫార్మర్‌ అవార్డులు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement