‘ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి’

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పేరుతో మోసపూరిత మాస్టర్‌ ప్లాన్‌ విడుదల చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం డీపీవో కార్యాలయంలో ఏఎస్పీ మౌనికను కలి సి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, ఇటీవల ఎలాంటి నిజా ధారాలు లేని డూప్లికేట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు విడుదల చేయడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. ఆదిలాబాద్‌ ఎ యిర్‌పోర్ట్‌ విషయంలో ఇంకా ఎలాంటి మాస్ట ర్‌ ప్లాన్‌ రూపొందించలేదని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వ యంగా పత్రికాముఖంగా ప్రకటించారని తెలి పారు. ఈనెల 17న కేంద్రబృందాలు సర్వే చే యబోతున్నాయని తెలపడంతో వీరి మోసం బయటపడిందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు అజయ్‌, ప్రకాశ్‌, వెంకటేశ్‌, వసంత్‌, అశోక్‌ స్వామి, భూమన్న, తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement