జైనథ్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల నుంచి మార్చి 28న పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 257 క్వింటాళ్ల కందులను జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాం అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. నాణ్యత లేమి కారణంతో తిరిగి లారీలో మార్కెట్‌యార్డుకు పంపించగా ఐదు రోజులైనా తీసుకునేందుకు అధి కారులు ముందుకురాలేదు. దీంతో విధిలేక పీ ఏసీఎస్ అధికారులు గురువారం వాటిని రైతులకు అప్పగించారు. వాటి రవాణా ఖర్చులూ భరించాలని చెబుతుండగా రైతులు లబోదిబో మంటున్నారు. నాసిరకంగా ఉంటే ముందుగా ఎందుకు కొనుగోలు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కందులను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.


