ఆదిలాబాద్‌రూరల్: జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన మహోన్నత పోరాట యోధుడు మర్సుకోల రాంజీగోండ్ అని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కొనియాడారు. గు రువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో రాంజీ గోండ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాంజీ గోండ్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వాలు ఆదివాసీ మహనీయుల చరిత్ర ను ప్రజలకు తెలియనీయడంలేదని ఆరోపించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న కూడా రాంజీ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ము న్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, కాంగ్రెస్ నా యకురాలు గండ్రత్ సుజాత, వివిధ సంఘాల నా యకులు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, సిడాం రాంకిషన్, మెస్రం శంకర్, గేడం మాధవ్, పూసం ఆనంద్‌రావ్, గేడం మనోహర్, కుర్సేంగే యాదవ్‌రావ్, మోహన్, గేడం భగవాన్, కుమ్ర జంగు, గే డం వనిత, మెస్రం సంగీత, ఆత్రం అనసూయ, ఆ త్రం వెంకటేశ్, అజయ్, మెట్టు ప్రహ్లాద్, రాజు, దు ర్వ నగేశ్, గోడం గంగారాం, దేవన్న పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాకు ‘రాంజీ’ పేరు పెట్టాలి
ఆదిలాబాద్ టౌన్: నిర్మల్ జిల్లాకు రాంజీ గోండ్ పేరు పెట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదా నికి వ్యతిరేకంగా ఆదివాసీలకు అడవిపై, భూమిపై హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరాటంలో రాంజీతో సహా వెయ్యిమంది అమరులైన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, జిల్లా అధ్యక్షుడు స్వామి, రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల, నాయకులు పోచక్క, రామన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు.


