ఆదిలాబాద్‌టౌన్: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారో గ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. ప్ర జాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువా రం రిమ్స్ నుంచి తెలంగాణచౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా జైలులో ఖైదీలకు హెచ్‌ఐవీ, ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. లారీ డ్రైవర్లకు హెచ్‌ఐవీ, కంటి, కిడ్నీ, కాలేయ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రక్షణ లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవ డం ద్వారా హెచ్‌ఐవీ బారినపడే ప్రమాదముందని హెచ్చరించారు. బాధితులపై వివక్ష చూపించకుండా ఆదరించాలని కోరారు. ఎయిడ్స్‌కు మందుల్లేవని తెలిపారు. నివారణ ఒక్కటే మార్గమని సూచించారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా ఇంజక్షన్ల ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఎయిడ్స్ అండ్ లెప్రసీ నివారణ అధికారి ఈశ్వర్‌రాజ్, టీబీ నివారణ అధికారి సుమలత తదితరులు పాల్గొన్నారు.


