అంబులెన్స్‌ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ల తనిఖీ

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ మండలంలోని 108, 102 అంబులెన్స్‌లను ప్రోగ్రామ్‌ మేనేజర్‌ సామ్రాట్‌, జిల్లా ఇన్‌చార్జి శేఖర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లోని సిబ్బంది అంబులెన్స్‌లతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బకు గురైన బాధితుల నుంచి కాల్‌ రాగానే తక్షణమే స్పందించాలని సూచించారు. బాధితుల్లో శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు అంబులెన్స్‌లలో ఐస్‌ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే ప్రథ మ చికిత్స అందించి, ఆలస్యం చేయకుండా సమీప ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అనంతరం 108 సిబ్బందితో సమావేశమై అంబులెన్స్‌లోని వైద్యపరికరాలు, రికార్డులు పరిశీలించారు. 108 ఈఎంటీలు శంకర్‌, దత్తాత్రేయ, పైలెట్‌లు ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌, 102 సిబ్బంది వెంకటేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement