మాతాశిశు మరణాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలు అరికట్టాలి

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మాతాశిశు మరణాలను అరి కట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో రాఽథోడ్‌ నరేందర్‌ అన్నారు. ప్ర జాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం రిమ్స్‌ సమావేశ మందిరంలో సేఫ్‌ మదర్‌హుడ్‌ డే కార్యక్రమం నిర్వహించారు. మాతా, శిశు మరణాలు అరికట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గర్భిణులను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి రిజిస్ట్రేషన్‌ చేయించడం, కనీసం నాలుగు ఏఎన్‌సీ చెకప్‌లు నిర్వహించడం, హై రిస్క్‌ ప్రెగ్నెన్సీలను గుర్తించి తక్షణ చికిత్స అందించడం ద్వారా మాతా మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం ద్వారా తల్లి–శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ఇందులో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ నరేందర్‌, గైనకాలజీవిభాగాధిపతి పద్మిని, ప్రో గ్రాం ఆఫీసర్‌ సాధన, దీపక్‌ పుష్కర్‌ తదితరు లు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యత

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలు, విద్యార్థినిలకు రక్షణగా ఆదిలాబాద్‌ షీ టీం 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ప్రకటనలో తెలిపారు. మహిళలు అత్యవసర సమయంలో షీటీం సభ్యులను సంప్రదించాలని పేర్కొన్నారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వికృత చేష్టలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏప్రిల్‌లో విడుదలైన రాష్ట్ర వ్యాప్త షీటీం నివేదికలో జిల్లా బృందం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఈమేరకు టీం సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్‌ 100 లేదా ఆదిలాబాద్‌ షీ టీం 8712659953 నంబర్‌లో సంప్రదించి సాయం పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement