అటవీ అనుమతుల పేరిట అభివృద్ధిని అడ్డుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

అటవీ అనుమతుల పేరిట అభివృద్ధిని అడ్డుకోవద్దు

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

బోథ్‌/కై లాస్‌నగర్‌: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో గిరిజనుల అటవీ సమస్యలపై బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అటవీ భూములకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్‌ అనుమతుల సాకుతో అనేక గూడేలకు నేటికీ రహదారి, విద్యుత్‌ సౌకర్యం వంటివి కరువయ్యాయన్నారు. ఆయా గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించేదుకు అటవీశాఖ తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే గిరి వికాసం పథకం కింద మంజూరైన బోర్ల విషయంలోనూ ఆ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి తో పాటు ఉన్నతాధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

సమీక్షలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ పాల్గొన్నారు. జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను, పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు మానవతా ధృక్పథంతో సహకరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement