అథ్లెట్ పి.స్వాతి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. మహబూబ్‌నగర్ వేదికగా 2025 సెప్టెంబర్ 30న జరిగిన జూనియర్ స్టేట్ మీట్‌లో 80 మీటర్ల హర్డిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. అలాగే 2026 జనవరి 19న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ మీట్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. ఇలా పతకాల జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హన్మకొండలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ’సీఎం కప్’ పోటీల్లో 80 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం కై వసం చేసుకుని అథ్లెటిక్స్ లో మెరుస్తోంది.
‘నిత్య’ పంచ్ విసిరితే.. పతకమే
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న జే.నిత్య బాక్సింగ్ రింగ్‌లో సత్తా చాటుతోంది. పతకాల వేట కొనసాగిస్తోంది. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులపై పంచ్‌లు విసురుతూ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన 4వ సబ్ జూనియర్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌తో పాటు, పుదుచ్చేరి వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని షేక్‌పేట వేదికగా జరిగిన 4వ అండర్–15 సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ, అలాగే సౌత్ జోన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లోనూ వరుసగా స్వర్ణ పతకాలను
కై వసం చేసుకుని సత్తా చాటింది.


