● కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి
కై లాస్‌నగర్: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ మారాలనుకున్నప్పుడు తాను చేరే పార్టీపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరే సమయంలో కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకే సీఎం రేవంత్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని, రామన్న ఆయన కుటుంబ సభ్యులు తొమ్మిదేళ్లపాటు చేసిన వ్యవహారాలతో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు. ఇందులో పార్టీ నాయకులు సుధాకర్ గౌడ్, సంజయ్, బీడీ చారి తదితరులున్నారు.


