అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

● తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్‌

ఉట్నూర్‌రూరల్‌: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్‌ అన్నారు. మంగళవారం ఐటీడీఏ కా ర్యాలయంలో పీవో యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ), ఇంజినీరింగ్‌, విద్య, గురుకులాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉద్యానవనం, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, భూ వివాదాలు, అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఆయనకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, కొలం, గోండు తెగకు చెందిన నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement