మూల్యాంకన బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకన బకాయిలు చెల్లించాలి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

● స్పాట్‌ వద్ద ఉపాధ్యాయ జేఏసీ నిరసన

ఆదిలాబాద్‌టౌన్‌: గతేడాది పదో తరగతి మూల్యాంకన బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టెన్త్‌ స్పాట్‌ కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్‌ మాట్లాడుతూ, గతేడాది మూల్యాంకన బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కె. కిష్టన్న, వృకోధర్‌, నాగేందర్‌, గోపాల్‌ సింగ్‌, శశికళ , సతీష్‌, చంద్రశేఖర్‌, రవీందర్‌, స్వామి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement