జన్నారం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్నారం 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలట్‌లు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఈఎంటీ కిషన్, పైలట్ రఫీక్ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టియానో, హెల్త్ కమిషనర్ సంగీత చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని జిల్లా ప్రోగ్రాం అధికారి సమ్రాట్, జిల్లా ఈఎంఈ కొండల్‌రావు అభినందించారు.
ప్రథమ చికిత్స ప్రదర్శన పోటీలు
కాసిపేట: రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ప్రథమ చికిత్స(ఫస్ట్‌ఎయిడ్) ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సూపరింటెండెంట్ లోక్‌నాథ్‌రెడ్డి, డెప్యూటీ జనరల్‌మేనేజర్ విజయ్‌కుమార్, మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, రక్షణాధికారి నిఖిల్, డెప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమాధికారి మీర్జాగౌస్, పిట్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


