ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మా త్రం ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది.
– జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి


