ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేయాలని భీంపూర్‌ మండలం తాంసి కె గ్రామస్తులు, రికార్డు అసిస్టెంటు ఉద్యోగం ఇప్పించాలని ఉట్నూర్‌కు చెందిన మెస్రం కార్తీక్‌, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్‌కు చెందిన కుడిమెత శ్రీనివాస్‌ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

06కేఎన్‌పీ27: అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ ఏవో దామోదర స్వామి

అర్జీలు స్వీకరిస్తున్న ఐటీడీఏ ఏవో దామోదర స్వామి

Advertisement
 
Advertisement
Advertisement