కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

జైపూర్‌: సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ పరిసర ప్రాంతాలలో ఏర్పడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్‌లోని పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డుకు సోమవారం పెగడపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్లాంట్‌ నిర్వహణతో గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యాష్‌ కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో దుస్స భాస్కర్‌, రాజా గౌడ్‌, రాజేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌చారి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement