ఇచ్చోడ: మండలంలోని కామగిరిలో జాదవ్ హరి బా అనే రైతు ఐదెకరాల్లో సాగు చేసిన జొ న్న పంట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు సోమవారం సాయంత్రం వి ద్యుత్ మోటార్‌కు ఉన్న విద్యుత్ తీగల వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పంటకు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసి పడటంతో గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వాహ నం సీఎం బందోబస్తులో ఉండటంతో అరగంట వ్యవధిలోనే జొన్న పంట కాలిబూడిదయింది. ఘటనలో దాదాపు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతు వాపోయాడు.
బిలోలిలో...
లోకేశ్వరం: మండలంలోని బిలోలిలో రైతు ఏరోల్ల రమణారావుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు సదరు రైతు నాలుగెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను వారం రోజుల క్రితం కోసి పంటను చేలోనే ఆరబెట్టాడు. సోమవారం పంట చేనులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో మంటలు చెలరేగి పంట పూర్తిగా దగ్ధమైంది. పంట విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. విద్యుత్ తీగల విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతు ఆరోపిస్తున్నాడు.
కుభీర్: మండలంలోని సిర్పెల్లి(హెచ్)లో సోమవారం ఉదయం 3గంటల ప్రాంతంలో జాదవ్ దత్తారాంకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఎకరంన్నర భూమిలో సాగు చేసిన మొక్కజొన్న పంటను కోసి కుప్పలు వేశారు. మంటలు వ్యాపించి పంట దగ్ధమైంది. దీంతో సుమారు రూ.లక్ష 50వేల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మాలేగాం గ్రామంలో గౌతం, భోజరాంలకు చెందిన మొక్కజొన్న కుప్పలు సైతం కాలిపోయాయి. సుమారు రూ.5లక్షల నష్టం జరిగినట్లు ఆర్‌ఐ నరేశ్ తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు సతీశ్, లక్ష్మి ఉన్నారు.


