ఆదిలాబాద్‌టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన రిమ్స్‌లో ప్రస్తుతం రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. ఆస్పత్రిలో 21 విభాగాల్లో, సూపర్ స్పె షాలిటీలో మరో ఏడు విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నిత్యం 2వేల వరకు ఓపీ, 900 వరకు ఇన్‌పేషెంట్లుగా చికి త్స పొందుతున్నట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. అన్నిరకాల శస్త్ర చికిత్సలతో పాటు అత్యవసర సేవలకు సంబంధించి ఇటీవల క్రిటికల్ కేర్ కూడా అందుబాటులోకి వచ్చింది. సూపర్ స్పెషా లిటీలో కార్డియాలజిస్టు రాకతో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఇక్కడే చికిత్స పొందుతున్నారు.
అందుతున్న సేవలు..
ఎంఆర్‌ఐ, సిటిస్కాన్, ఆల్ట్రాస్కాన్, టిఫ్పా స్కాన్, డయాలసిస్, టీ–హబ్, ఎక్స్‌రే, బ్లడ్‌బ్యాంక్, సాధారణ ప్రసవాలు, సిజేరియన్, వెల్‌నెస్ సెంటర్, వృద్ధుల కోసం జరియాట్రిక్ కేర్, కీమోథెరపీ, క్రిటికల్ కేర్, డయాలసిస్, ల్యాప్రోస్కోపి, హెర్నియా, కంటి, ఆర్థో, ఈఎన్‌టీ, యూరాలజీ, క్యాన్సర్ సేవలు అందుతున్నాయి. అత్యవసరానికి సంబంధించి ఎంఐసీ యూ, ఎస్‌ఐసీయూ, పీఐసీయూ, ఆర్‌ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, టీబీనాట్ ద్వారా టీబీ టెస్టులు, ప్యాథాలజీ సేవలను రోగులు పొందుతున్నారు.
తీరుతున్న వైద్యుల కొరత
రిమ్స్‌లో గతంలో వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం 140 మంది వైద్యులు పనిచేస్తుండగా, 120 మంది హౌస్‌సర్జన్లు, 190 మంది పీజీ వైద్యులు, 220 మంది నర్సింగ్ విద్యార్థులు, 600 మంది యూజీ విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో యూ రాలజీ, క్యాన్సర్ సర్జన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జన్, పీడియాట్రిక్ సర్జన్, న్యూరో సర్జన్ సేవలు అందుతున్నాయి.
మెరుగైన సేవలందిస్తున్నాం..
రిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ప్రహరీ, ఇంటర్నల్ సీసీ రోడ్లు, రిమ్స్ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లేందుకు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి, డాక్టర్ క్వార్టర్స్, ఎంసీహెచ్ బిల్డింగ్ కోసం ప్రభుత్వానికి నివేదించాం. రిమ్స్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుతున్న సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్


