నేడు బాసరలో ఆర్జిత సేవలు రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు బాసరలో ఆర్జిత సేవలు రద్దు

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

బాసర: బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సే వలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం బాసర సరస్వతీ ఆలయంలో రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్షరభ్యాసాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

107 మక్కల బస్తాలు చోరీ

కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల అంతర్రాష్ట్ర రహదారిపై కొత్త వెంకూర్‌ సమీపంలో తూకం వేసి ఉంచిన 107 మక్కల బస్తాలు శనివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మండలంలోని కొత్త వెంకూర్‌ గ్రామానికి చెందిన మగ్గిడి చిన్న నారాయణ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వారం క్రితం పంట కోసి ఆరబెట్టాడు. శనివారం రా త్రి పాత వెంకూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యాపారి దత్తు పటేల్‌కు మక్కలు విక్రయించాడు. బస్తా 55 కేజీల చొప్పున తూకం వేసిన 107 బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లి పోయారని రైతు వాపోయాడు. బస్తాలు చోరీ జరగడంతో రూ.1 లక్ష 42 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఎస్సై అశోక్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement