మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు | - | Sakshi
Sakshi News home page

మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

‘భట్టి’ పాదయాత్రకు మూడేళ్లు

నాడు పిప్రిలో శ్రీకారం చుట్టిన విక్రమార్క

అధికారంలోకి రాగానే గ్రామానికి ప్రత్యేక నిధులు

అభివృద్ధి పనులతో మారుతున్న

పల్లె రూపురేఖలు

రేపు సీఎం బహిరంగ సభ

బజార్‌హత్నూర్‌: కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తే వడమే లక్ష్యంగా ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూ ర్‌ మండలంలోని పిప్రి గ్రామంలో నాడు పీసీసీ హో దాలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామానికి ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. 2023 మార్చి 16న మొదలైన ఈ యాత్ర 16 జిల్లాలు, 37 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాల్లో 1,365 కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావ డం డిప్యూటీ సీఎంగా భట్టి కొలువుదీరిన విషయం తెలిసిందే.

మాట నిలబెట్టుకున్న ‘భట్టి’

పాదయాత్ర సందర్భంగా నాడు ఇచ్చిన హామీ మేర కు 2024 ఆగస్టు 7న భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో గ్రామానికి విచ్చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.20.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌, ట్రైకా ర్‌, ఐటీడీఏ బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన చె క్కులను పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 72మంది దళిత రైతులకు పంటచేలకు బోర్లు వే యించారు. విద్యుత్‌ కనెక్షన్‌ అందించాల్సి ఉంది. అలాగే రూ.2.90 కోట్ల నిధులతో ప్రతీవార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అన్ని చోట్ల పూర్తయ్యాయి. గ్రామ సమీపంలో బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు అనుబంధంగా సబ్‌మార్కెట్‌కు ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటా యించారు. భవనం మంజూరు కావాల్సి ఉంది. అలాగే 17మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. రేపు గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం రానున్నా రు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

దండిగా నిధులు..

ఈ గ్రామ అభివృద్ధికి గాను 2026 ఫిబ్రవరి 5న కలెక్టర్‌ రాజర్షిషా రూ.10 కోట్ల నిధుల కోసం ఆర్థిక శాఖకు నివేదించగా మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం రూ.15 లక్షల చొప్పున నాలుగింటికి రూ.60 లక్షలు, అంగన్‌వాడీ –1, 2 భవనాల నిర్మాణానికి రూ.14.80 లక్షల చొప్పున రూ.29.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. గ్రామం నుంచి ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌ బీటీ రోడ్డు విస్తరణ కోసం రూ.2.18 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరో 7 అభివృద్ధి పనులకు రూ.2.87 కోట్లు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement