‘సెల్‌’ వెలుతురులో మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

‘సెల్‌’ వెలుతురులో మూల్యాంకనం

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

● ‘టెన్త్‌’ స్పాట్‌కు విద్యుత్‌ అంతరాయం ● ఉక్కపోతతో ఉపాధ్యాయుల అవస్థలు

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఉపాధ్యాయులు 48వేల జవాబుపత్రాలను మూల్యాంకనం చేశా రు. ఇంత వరకు బాగానే ఉంది. శనివారం సాయంత్రం మూల్యాంకనం చేస్తున్న సమయంలో కురిసిన అకాల వర్షంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 45 నిమిషాల పాటు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ వెలుతురులో మూల్యాంకనం చే శారు. దీనికి తోడు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడ్డారు. చీకటిలో పేపర్లు దిద్దడం ద్వారా పారపాట్లు జరిగితే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అధికారులు పట్టింపులేమిపై ఉపాధ్యాయ సంఘాలు ఆసహనం వ్యక్తం చేశాయి. ఈ విషయ మై పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణుగో పాల్‌రెడ్డిని వివరణ కోరగా విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు లేటర్‌ ఇచ్చామన్నారు. ఇదివరకు జనరేటర్‌ను ఏర్పాటు చేశా మని ఈ సారి స్పాట్‌ ఎక్కువ రోజులు ఉండటంతోనే ఏర్పాటు చేయలేకపోయామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement