● ఏజెన్సీ నిర్వాకంపై డీఎస్‌వో ఆగ్రహం
కై లాస్‌నగర్: జిల్లాలో గ్యాస్ కష్టాలు తొలగడం లేదు. స్థానిక రిషి శంకర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రెండు రోజులుగా డోర్ డెలివరీ నిలిపివేశారు. దీంతో బుకింగ్ చేసుకున్న వినియోగదారులు సిలిండర్లతో ఏజెన్సీ వద్దకు చేరుకున్నారు. మండుటెండలో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు. ఓటీపీ రావడం లేదనే కారణంతో నిర్వాహకులు రశీదులు ఇవ్వడంలో జాప్యం చేశారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్‌వో నందిని అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిని ప్రశ్నించగా ఓటీపీ రాకపోవడంతోనే సిలిండర్లు ఇవ్వడం లేదంటూ దురుసుగా సమాధానమిచ్చారు. వారి తీరుపై తీవ్ర ఆగహం వ్యక్తం చేసిన డీఎస్‌వో ఇండియన్ ఆయిల్ కంపెనీ సెల్స్ అధికారి, ఏజెన్సీ యజమానితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆమె స్వ యంగా వినియోగదారుల సర్వీస్ నంబర్ల ఆ ధారంగా ఓటీపీ నంబర్లను చీటీలపై రాసి ఇచ్చి గోడౌన్ వద్దకు పంపించారు. విషయాన్ని కలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్‌వో పేర్కొన్నారు.


