కై లాస్‌నగర్: ప్రత్యేక ప్యాకేజీతో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి నియామకపత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడారు.
బీజేపీవి దేవుడి పేరిట రాజకీయాలు
బీజేపీని గద్దెనెక్కిస్తే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు దేశాన్ని కార్పొరేట్‌శక్తులు, ట్రంప్‌నకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి దేవుడి పేరిట రాజకీయాలు చేపడమే తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాలనలో ఏ సీఎం చేయనంతంగా అ ప్పులు చేసిన కేసీఆర్ పలాయనం చిత్తగించి ప్రస్తు తం ఫాంహౌస్‌కు పరిమితమైండని మండిపడ్డారు.
జిల్లాకేంద్రంలో త్వరలో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం
జిల్లా కేంద్రంలో త్వరలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరుస్తామని భరోసానిచ్చారు. పార్టీ జిల్లా కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు 74శాతం పోస్టులు కేటాయించామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికి సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, రేషన్‌కార్డులను జారీ చేశామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను పార్టీ కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ సునామీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. పదికి పది అసెంబ్లీ సీట్లను పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు ఆయనను పూలమాల, శాలువాతో సత్కరించారు. అంతకు ముందు మావల బైపాస్ వద్ద పార్టీ ఽశ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, నాయకులు గండ్రత్ సుజాత, సాజీద్‌ఖాన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


