అన్ని రంగాల్లో పట్టణాభివృద్ధి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో పట్టణాభివృద్ధి : కలెక్టర్‌

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

ఆదిలాబాద్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మున్సిపల్‌ పురోభివృద్ధిలో బడ్జెట్‌ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ, నూతన సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలి పారు. ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫ రా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అమృత పథకం కాలపరిమితి మరో ఏడాది పొడిగించబడిందని దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న డ్రెయినేజీ, మంచినీటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement