బజార్‌హత్నూర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పిప్రిలో ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ కోరారు. ఈ గ్రామాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత తీసుకు న్న విషయం తెలిసిందే. కాగా, సభాస్థలిని జి ల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పార్టీ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మండల అధ్యక్షు డు జల్కే పాండురంగ్, అశ్విన్‌రెడ్డి, జంగుబా బు, చిల్కూరి భూమన్న, సర్పంచ్ కృష్ణకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ విశాల్, లక్ష్మారెడ్డి, పోతన్న, సత్యనారాయణ, విఠల్, కిషన్, స్వామి, గణేశ్ తదితరులు ఉన్నారు.


