మత్తు వ్యసనాల నుంచి విముక్తి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మత్తు వ్యసనాల నుంచి విముక్తి లక్ష్యం

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మత్తు వ్యసనాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీ–అడిక్షన్‌ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు నాగరాజు, స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

తాంసి: జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్ర– మాండ్వికి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై పలుచోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. పొన్నారి వద్ద ఏర్పాటు చేసిన బోర్డును ఎస్పీ మంగళవారం ప్రారంభించారు. అరైవ్‌ అలైవ్‌ భాగంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్‌ జీవన్‌రెడ్డి, రూరల్‌ సీఐ కే.ఫణిధర్‌, తాంసి ఎస్సై జీవన్‌ రెడ్డి, పొన్నారి సర్పంచ్‌ భూమన్న, ఉపసర్పంచ్‌ రాంరెడ్డి, తదితరులున్నారు.

డ్రైవర్లకు నేత్రవైద్య పరీక్షలు

ఉట్నూర్‌రూరల్‌: మండలకేంద్రంలో జిల్లా పోలీ సుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఉచి తంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం డ్రైవర్లకు వైద్యులు సంధ్య పుష్కర్‌ పరీక్షలు నిర్వహించారు. 30 మందికి ఉచితంగా అద్దాలు అందించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఉట్నూర్‌ సీఐ ప్రసాద్‌, ఎస్సైలు జి.విజయ్‌, సాయన్న, శ్రీ సాయి, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement