నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు | - | Sakshi
Sakshi News home page

నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు

Mar 29 2026 7:06 AM | Updated on Mar 29 2026 7:06 AM

కైలాస్‌నగర్‌: పట్టణంలో పారిశుద్ధ్యనిర్వహణ, తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష అన్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కార్యాలయానికి చేరుకుని శానిటేషన్‌ వ ర్కర్స్‌, వాటర్‌ సెక్ష న్‌లో రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఎంతమంది సెలవులో ఉన్నారనే విషయంపై ఆరాతీశారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శా నిటేషన్‌ కార్మికుల పాత్ర కీలకమన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించా రు. ఆమె వెంట మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ సతీశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement