ఆదిలాబాద్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించా రు. అనంతరం క్షకిదారులకు రాజీపత్రాలు అందించారు. న్యాయవాదులతోపాటు అధికార యంత్రాంగం రానున్న రోజుల్లోనూ ఇదే సహకారం అందిస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఎస్పీ అఖిల్ మహాజన్, జడ్జిలు హుస్సేన్ నాయక్, దివ్యవాణి, తేజస్విని, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో 12వ స్థానం
జిల్లాలో పరిష్కారం అయిన కేసుల్లో మొత్తం క్రి మినల్ కేసులు6,284, ఫ్రీలిటిగేషన్ కేసులు 22,614 ఉన్నాయి. కేసుల పరిష్కారంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది.


