కైలాస్‌నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పా దయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి లో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈసభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీహాల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధి కారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయా త్ర మూడేళ్లు పూర్తి చే సుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూ జలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటల కు పిప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితా రాణా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్‌దీపక్ తదితరులు పాల్గొన్నారు.


