ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

Mar 29 2026 7:06 AM | Updated on Mar 29 2026 7:06 AM

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు సంబంధించి జిల్లాస్థాయి ఎంపిక పోటీలను శనివారం నిర్వహించారు. డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌ ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాస్థాయికి మొత్తం 67 మంది ఎంపికై నట్లు తెలిపారు. శనివారం 17 మంది బాలికలు, 33 మంది బాలురు హాజరైనట్లు వెల్లడించారు. వీరికి 30 మీటర్ల ఫ్లైయింగ్‌ స్టార్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 800 మీటర్ల పరుగు, 6X10 మీటర్ల షటిల్‌ రన్‌, మెడిసిన్‌ బాల్‌ త్రో, వర్టికల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 10మంది బాలికలు, 10మంది బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం మెడికల్‌ టెస్టులు సైతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం పలు కారణాలతో ఎంపిక పోటీలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు ఆదివా రం పోటీలు నిర్వహిస్తామని, అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడా పాఠశాల శిక్షకులు, రాజు, కబీర్‌ దాస్‌, శ్రీధర్‌, కొమ్ము కృష్ణ, డీఎస్‌ఏ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement