ఆదిలాబాద్‌టౌన్: హజ్‌యాత్రకు వెళ్లే వారు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వైద్యశిబిరంతో పాటు టీకాల పంపణీ శనివారం చే పట్టారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, 60 ఏళ్లు దాటిన యాత్రికులు బీపీ, షుగర్ వంటి సమస్యలుంటే మందులు వెంట తీసుకెళ్లాలని సూ చించారు. జిల్లా నుంచి 68 మంది యాత్రకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకోగా, శిబిరంలో పరీక్షలు నిర్వహించి మందులతో పాటు టీకాలు అందించామన్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ వైద్యుల సూచనలు పాటిస్తూ యాత్రను విజయవంతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్, డీఐవో వైసీ శ్రీనివాస్, వైద్యులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


