రైలు ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని మహిళ మృతి

Mar 25 2026 7:10 AM | Updated on Mar 25 2026 7:10 AM

తాండూర్‌: మండలంలోని తాండూర్‌ ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. జీఆర్పీహెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి తెలి పిన వివరాల ప్రకారం... బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఫర్హానా(29) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. మంగళవారం రైల్వేట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరు..

కుభీర్‌: మండలంలోని హల్దా గ్రామానికి చెందిన కె.మారుతి(40) మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి ఒకరు..

లక్ష్మణచాంద: ట్రాక్టర్‌ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోన్‌ మండలంలోని పాక్‌పట్లలో మంగళవారం చోటు చేసుకుంది. సోన్‌ మండలంలోని పాక్‌పట్లకు చెందిన ఓల్లెపు మహేష్‌ (36) కట్టెలు కొట్టడానికి వెళ్లి ట్రాక్టర్‌ పైన ముందుభాగంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఫిట్స్‌ రావడంతో కిందపడ్డాడు. గాయాలు కావడంతో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఓల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్‌ ఎస్సై గోపి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement