కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డిలను కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. చనాఖా–కొరటా నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.54కోట్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్‌లు, బీటీరోడ్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాల ని కలెక్టర్ రాజర్షి షాను ఇన్‌చార్జి మంత్రి ఆదేశించా రు. ఈనేపథ్యంలో చైర్‌పర్సన్ సోమవారం మున్సి పల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో కార్యాలయ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. అధి కారులు మంగళవారం నుంచి పట్టణంలోని వార్డు ల వారీగా పర్యటించి అవసరమైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.100 కోట్లు నాలుగు విడతలుగా మంజూరు చేసేలా మంత్రి హా మీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇందులో వైస్ చైర్మ న్ రోహిత్, కమిషనర్ జి.రాజు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్, నాయకులు సతీశ్ తదితరులున్నారు.


