శిశువును వదిలేసిన తల్లి
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఓ తల్లి తన రెండు నెలల శిశువును వదిలేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పాపను గమనించిన వన్‌టౌన్ కానిస్టేబుల్ రాజేశ్ 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్లు శ్రీకాంత్, రామకృష్ణ స్పందించి బాల రక్షక్ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం శిశువును శిశు గృహ ఆయా లక్ష్మమ్మకు అప్పగించారు. ప్రస్తుతం శిశువు శిశు గృహలో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: అటవీతో పాటు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ విశ్వనాథ చిన్నబూసరెడ్డి అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం బైక్ ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద ర్యాలీని ఎఫ్‌డీవో జెండా ఊపి ప్రారంభించారు. అటవీ సంరక్షణలో ఉద్యోగుల కృషి అభినందనీయమని కొనియాడారు. అటవీ రక్షణలో ప్రజల సహకారంతో పాటు నూతన సర్పంచులు భాగస్వామ్యం అందిస్తున్నారని వివరించారు.


