ఆదిలాబాద్‌టౌన్: రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న సోమవారం పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజ కీయాలు మాని ప్రజల పక్షాన నిలవాలన్నారు. ఫిబ్రవరి 13న ఎంపీ, ఎమ్మెల్యేలు భూమిపూజ చేసి రైల్వే అండర్‌బ్రిడ్జి పనులు ప్రారంభించారని, ప్రస్తుతం పనులు ఆగిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకొని గుంతలు పూడ్చి రాకపోకలు జరిగేలా చూడాలన్నారు. లేనిపక్షంలో సొంత ఖర్చుతో గుంతలను పూడ్చుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాసం నర్సింగ్‌రావు, నారాయణ, ప్రహ్లాద్, సాజిదొద్దీన్, ప్రకాశ్, వెంకటేశ్, ధమ్మపాల్, ఇమ్రాన్, గణేశ్, రమేశ్, ప్రేమల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.


